నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 14 : మల్లయ్య కొండ మహాశివరాత్రికి కాలినడకన, వాహనాలలో అన్నదానానికి తరలివచ్చే వేలాదిమంది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దుకాణదారులు సహకరించాలని ఎస్సై అనిల్ కుమార్ సూచించారు. శనివారం ఆయన మల్లయ్య కొండ తో పాటు వెలుగు మల్లమ్మ గుడి, కొండ కింద అన్నదానం కార్యక్రమాల వద్ద భక్తులకు ఇబ్బందులేకుండా దుకాణదారులు నిర్దేశిత ప్రాంతాలలో ఉంచుకోవాలని హెచ్చరించారు. కొండపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డి.ఎస్.పి మహేంద్ర, సిఐ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని భక్తులు సమన్వయం పాటించి సహకరించాలని ఆయన విలేకరులకు తెలిపారు. ఆయన వెంట టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, అన్నదాన కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News