నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 29 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో సోమవారం ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి జాతీయ నాయకులు నరేంద్ర మాదిగ జన్మదిన వేడుకలను స్థానిక ఎంఆర్పిఎస్, ఎమ్మెస్ పి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఘాట్ లో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి జిందాబాద్, మందకృష్ణ మాదిగ, నరేంద్ర మాదిగ నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వై. గంగాధర్, తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున, జిల్లా నాయకుడు వెంకటప్ప, వై కదిరి నరసింహులు, చెన్నకృష్ణ, ఎద్దుల వెంకటరమణ, నరసింహులు, మారప్ప, రమణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News