నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 19 : తంబళ్లపల్లి మండలంలోని కోసువారిపల్లి లో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో రైతు శ్రీనివాసులు రెడ్డి నిర్వహిస్తున్న గొర్రెల ఫార్మ్ గొర్రెల పెంపకం దారులకు ఆదర్శనీయమని మదనపల్లె పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రసూల్ సాబ్ కొనియాడారు. గురువారం ఆయన మండల పశువైద్యాధికారి విక్రమ్ రెడ్డి తో గొర్రెల ఫార్మ్ ను పరిశీలించారు. ఈ షెడ్డు నేషనల్ స్టాక్ లైవ్ మిషన్ ద్వారా 20 లక్షల రుణంతో 100 గొర్రెలతో పథకం ప్రారంభించి విజయవంతంగా నడుస్తున్నట్లు రైతు డీడీకి వివరించారు. ఎన్ ఎల్ ఎం పథకంలో 10 లక్షల సబ్సిడీకి గాను మొదటి విడత సబ్సిడీ పొందానని రెండో విడత రావాల్సి ఉందని వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ కోసువారిపల్లి రైతు శ్రీనివాసరెడ్డి నీ ఆదర్శంగా తీసుకొని మండలంలోని గొర్రెల పెంపకం దారులు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పాడి ఆవులతో పాటు గొర్రెల పెంపకం పై దృష్టి సారించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
Reporter
Namitha News