నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 09 : తంబళ్లపల్లె మండలం కుక్క రాజు పల్లె పంచాయతీలో రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలంలోని చెట్టును ఓ వ్యక్తి నరికేశాడని గ్రామస్తులు మంగళవారం తాసిల్దార్ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి రోడ్డు పక్కన జనాలకు నీడను ఇచ్చే చెట్టును ఓ వ్యక్తి నరికేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తాసిల్దార్ శ్రీనివాసులతో పాటు తంబళ్లపల్లె పోలీస్స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశారు. తాసిల్దార్ వెంటనే స్పందించి సంబంధిత విఆర్ఓ చేత విచారణ చేయించి అతనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.
Reporter
Namitha News