నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 26 : భారత రాష్ట్రపతి గారి చేతులమీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును పొందిన పారా అథ్లెట్ క్రీడాకారిణి శివాని ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఘనంగా సత్కరించారు. జన్మతః కుడి చేయి లేకుండా జన్మించి మదనపల్లి లోని జవహర్ నవోదయ విద్యాలయ సమితి లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని పారా అథ్లెట్ క్రీడాకారిణి కుమారి హెచ్. శివాని ని గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఘనంగా సత్కరించారు. కుమారి శివాని విభిన్న ప్రతిభావంతుల కేటగిరీ షాట్‌పుట్ మరియు జావెలిన్ త్రో పోటీలలో జాతీయ స్థాయి పారా అథ్లెట్ గా, థాయిలాండ్, బెంగళూరు, గుజరాత్ వంటి దేశీయ-అంతర్జాతీయ వేదికలపై పోటీపడి మూడు బంగారు పతకాలు సాధించింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నమయ్య జిల్లా నుండి కుమారి శివానిని రాష్ట్రీయ బాల పురస్కార అవార్డుకు నామినేట్ చేసిన సందర్భంగా 26 డిసెంబర్ 2025 నాడు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును కుమారి శివాని అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుమారి శివానిని విద్యార్థిని విద్యార్థులు అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, శివాని మరిన్ని బంగారు పథకాలు సాధించాలని తెలిపారు.
Admin
Namitha News