నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 27 : మాదకద్ర వ్యాధి వినియోగంపై డ్రోన్లతో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, మాదకద్రవ్యాల వినియోగం పై జీరో టోలరెన్స్ తో కలిపి కఠిన చర్యలు చేపట్టాలని జిల్లాలో కూల్ లిప్ అనే నికోటిన్ పదార్థాన్ని వినియోగించకుండా చర్యలు చేపట్టాలని ఎన్జీవోల సమన్వయంతో డిఎడిక్షన్ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ తో కలిసి పోలీస్, రెవెన్యూ, విద్య, వైద్య, ఎక్సైజ్, తదితర అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... ఇటీవలే ముఖ్యమంత్రివర్యులతో సమావేశంలో మాదకద్రగాల నిర్మూలన గురించి చర్చించడం జరిగిందని మాదకద్రవ్యాల పై జీరో టోలరెన్స్ ఉండాలని ముఖ్యమంత్రివర్యులు సూచించినట్లుగా పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో డి అడిక్షన్ కేంద్రం ఏర్పాటు అయ్యేంతవరకు జిల్లాలోని ఎన్జీవో లతో మాట్లాడి డి-అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేయాలని, మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని కౌన్సిలింగ్ అనంతరం తమ ఇంటికి పంపిన తర్వాత వారిపై దృష్టి పెట్టి మళ్లీ బానిసలు కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా పోలీస్ రెవెన్యూ వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ఎస్ హెచ్ ఓ లు ఈగల్ క్లబ్ సభ్యులతో సమన్వయం చేసుకొని మాదకద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించాలన్నారు. అనంతరం డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం పై గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాదకద్రగాలపై జిల్లాలో చేపడుతున్న వివిధ అవగాహన కార్యక్రమాలను, డ్రోన్లను వినియోగించుకొని చేపట్టిన కార్యక్రమాలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. అన్నమయ్య జిల్లాలోని పాఠశాలలు కళాశాలలలో మాదకద్రకాలపై సుమారు 600కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని 3k రన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించామని వీటిని గ్రామాల స్థాయిలో కూడా నిర్వహిస్తున్నామన్నారు. 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదులు చేయవచ్చన్న అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మదనపల్లిలో వ్యసన విముక్తి కేంద్రం (De-Addiction) ఏర్పాటు చేయడం అవసరం ఉందని జిల్లా కలెక్టర్కు వివరించగా దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అధికారులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. డ్రోన్లను వినియోగించుకొని మాదకద్రవ్యాలను వాడే వారిపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. శిక్షణ పొందిన కుక్కలను వినియోగించుకొని బస్సు స్టేషన్స్ వంటి ప్రాంతాలలో గంజాయిని వాడే వారిని మరియు రవాణా చేసే వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ కార్యక్రమం ద్వారా పాఠశాలలు మరియు కళాశాలల వద్ద మాదకద్రవ్యాల వినియోగాన్ని రూపుమాపేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఇటీవల ఒక పాఠశాల వద్ద కూల్ లిప్ అనే నికోటిన్ పదార్థాన్ని అమ్ముతుండగా పోలీసులు గుర్తించారని తమిళనాడు ప్రభుత్వం ఇటీవలే కూల్ లిప్ ను నిషేధించిందని జిల్లా ఎస్పీ కలెక్టర్కు వివరించగా అన్ని పాఠశాలలు మరియు విద్యాసంస్థలలో కూల్ లిప్ నికోటిన్ పదార్థాన్ని నిషేధించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. ఈగల్ వ్యవస్థ వజ్రప్రహార అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఈ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలన పై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
Admin
Namitha News