నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 12 : వర్షాభావ పరిస్థితులను అధిగమించడానికి వాటర్ షెడ్ల ద్వారా నీటి సంరక్షణ పనులు చేపట్టి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని వాటర్షెడ్ ఏపీ డి లక్ష్మీనరసయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం కోటకొండ సచివాలయంలో పిఓ ఖాజా మొహిద్దిన్ ఆధ్వర్యంలో మర్రిమాకులపల్లి మెగా వాటర్ షెడ్ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ వాటర్ షెడ్ చేపట్టే పనుల ద్వారా నీటిని సంరక్షించి తద్వారా భూగర్భ జలాలు పెంపొందుతాయని సూచించారు. వాటర్ షెడ్ పనులలో భాగంగా నీటి సంరక్షణ పనులతో పాటు పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం విరివిగా చేపట్టాలని సూచించారు. అనంతరం సచివాలయ ఆవరణంలో ఏపీ డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఐఎంసిబి పిఓ మేఘనాథ్, టి వో లు హిమబిందు, ఆంజనేయులు, సాంబశివ వాటర్ షెడ్ చైర్మన్లు మల్లప్ప, మల్లికార్జున, ప్రకాశ్ రెడ్డి, నరసింహారెడ్డి, రవిశంకర్ రెడ్డి, రమేష్ రెడ్డి,సర్పంచ్ తాళ్ల అరుణ చంద్రశేఖర్, ఎంపీటీసీ పద్మనాభ రెడ్డి, బిజెపి నాయకులు రాజేష్ రెడ్డి, టిడిపి నాయకుడు గురుమూర్తి రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News