నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిసెంబర్ 17 : కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు గుర్రంకొండ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పి. సి. సి. అధ్యక్షులు YS షర్మిళ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గుర్రంకొండ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు, ఈ సందర్బంగా సమీరుద్దీన్ మాట్లాడుతూ షర్మిళమ్మ అభినవ ఝాన్సీ రాణి అని ప్రజా సమస్యలపై నిర్వీరమా పోరాటం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని నీలాదీసే తీరు అమోఘమైనదని కొనియాడారు, ఇలాంటి నాయకురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రధసారది గా దొరకటం తాము చేసుకున్న అదృష్టమని, షర్మిలమ్మ గారి నాయకత్వంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయటానికి తమ సాయ శక్తుల కృషి చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ జాయింట్ సెక్రటరీ గౌస్ బాషా,మండల కన్వీనర్ ఫైరోజ్ ఖాన్,మైనారిటీ నాయకులు ఖాజా, అర్షద్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News