Sunday, 26 July 2026 09:08:13 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సచివాలయ సేవల్లో వేగం – పారదర్శకతకు ప్రాధాన్యం

కోటకాడపల్లె సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 08 April 2026 07:10 PM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 08: అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలం కోటకాడపల్లె గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో ఏయే శాఖల కార్యదర్శిలు ఉన్నారు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, వినతులు–ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని కలెక్టర్ సమీక్షించారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ సమయానికి విధులకు హాజరై ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఈ విధానం ఖచ్చితంగా అమలు చేస్తే సేవలలో పారదర్శకత, బాధ్యత మరింత పెరుగుతాయన్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులో పరిష్కరించి, సచివాలయ సేవలు సులభంగా, వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థుల సమస్యలపై ప్రతి సిబ్బంది బాధ్యతతో స్పందించాలని తెలిపారు. భూ రికార్డులు, ల్యాండ్ రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, వాటిని సక్రమంగా నవీకరించాలని అధికారులకు సూచించారు. భూ వివరాలు స్పష్టంగా ఉంటే వివాదాలు తగ్గి ప్రజలకు సేవలు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. సచివాలయంలోని అన్ని శాఖల వివరాలను డిజిటల్ విధానంలో నవీకరించడంతో పాటు పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన పెంచి అర్హులందరికీ లబ్ధి చేకూరేలా కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో తహసీల్దారు, ఎంపీడీవో, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: