Monday, 27 July 2026 03:34:31 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రాష్ట్ర మంత్రుల పర్యటనలో మదనపల్లెకు ఓరిగింది ఏమి...?

మదనపల్లె జిల్లా, మెడికల్ కాలేజ్, కిడ్నీ మాఫియా... స్పష్టత ఇవ్వని పర్యటన....?

Date : 14 November 2025 08:45 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 14 : మదనపల్లి కి రాష్ట్ర మంత్రులు ముగ్గురు వచ్చారు, వెళ్ళారు, మదనపల్లె జిల్లా పై స్పష్టమైన హామీ ఏదీ...!? మదనపల్లె కేంద్రంగా జరిగిన కిడ్ని రాకెట్ పై ఏమి చర్యలు తీసుకున్నారు, హాస్పిటల్ సీజ్ చేస్తారా, ఇంక ఎవరికి, ఏమి, సంబంధాలు వున్నాయనే విషయాలు వెల్లడించక పోవడం దురదృష్టకరం అన్నారు.‌ మాటైన మాట్లాడని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మెడికల్ కాలేజ్ పిపిపి విధానంపై ఏమీ మాట్లడని వైద్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ అంటూ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ విమర్శలు గుప్పించారు. ‌శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కూటమి మంత్రుల మదనపల్లె పర్యటనలో మదనపల్లె అభివృద్ధి విస్మరించారని అన్నారు. ఈ సందర్భంగా ఎస్‌. రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ మదనపల్లె పట్టణానికి గురువారం కూటమి పార్టీలకు చెందిన ముగ్గురు మంత్రులు వచ్చారు. వారు రావడానికి ముందు మదనపల్లె ప్రజలు ఎంతో ఆత్రుతతో మదనపల్లె పై వరాలజల్లు కురిపిస్తారని ఎదురు చూశారు, వారు వచ్చిన తరువాత ఎందుకు వచ్చారు, ఎమీ ఇచ్చారు అని ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దశాబ్దాల కల అయిన ‌మదనపల్లె జిల్లా ఏర్పాటు పై మంత్రులు స్పష్టమైన ప్రకటన చేసి మదనపల్లె ప్రజలకు మంత్రులు శుభవార్త అందిస్తారని ప్రజలు ఆకాంక్షిస్తే ఊసురుమనిపించడం బాధకరమైన విషయం, మెడికల్ కాలేజ్ పైన వైద్య ఆరోగ్య శాఖమంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటన చేస్తే బాగుండేదని అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి వారి పార్టీకి చెందిన వ్వక్తి ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చారు, ఇక్కడ అభివృద్ధి, సివిల్ సప్లై పైన ఎలాంటి హామీలు ఇవ్వకుండా వెళ్ళడం దురదృష్టకరం అన్నారు. మదనపల్లె పట్టణం అభివృద్ధి, రోడ్ల దుస్థితిపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం మంత్రుల పర్యటనపై ఇక్కడి ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‌వారి పార్టీ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకమండలి ప్రమాణ స్వీకారం తప్ప ప్రజలకు ఉపయోగపడింది శూన్యం, ప్రజాధనం వృధా పర్యటనగా అభివర్ణించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :