నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 13 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీ నందు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), డి.ఆర్.డి.ఓ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన వేసవి శిక్షణా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కు 10 మంది విద్యార్థులు ఎంపిక అయినట్లు వైస్ ఛాన్సిలర్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బి.టెక్ చివరి సంవత్సరము చదువుతున్న సి.ఏ.ఈ విభాగము నుంచి 3, ఈ.సి.ఈ నుంచి 4 మరియు మెకానికల్ నుంచి 3 విద్యార్థులు ఎంపిక అయినట్లు ఆయన అన్నారు. వీరు ఈ నెలలో ఇంటెర్షిప్ మొదలై జూన్ ఇందులో కొనసాగుతారని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ ఫై. రామనాథన్, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్. పి. ఎం. బాలాజీ తదితరులు అభిందనలు తెలియజేసారు.
Reporter
Namitha News