నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 22 : దైవత్వానికి మతం అడ్డు కాదని ఆదివారం మల్లయ్య కొండ మహాశివుని మైనార్టీ విద్యాధికులు, సమాజ సేవకులు దర్శించుకోవడం విశేషం. ఉదయం డాక్టర్ హీనా(ఎంబిబిఎస్. ఎండి) డాక్టర్ జునైద్ (ఎంబిబిఎస్) డాక్టర్ బాబాజీ, డాక్టర్ మస్సు, డాక్టర్ షాకీర్ (ఎండి) ఖతీజా(ఎంబీఏ డిఫారమ్) సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు షబ్ నమ్, ఎండి రఫీ, సాఫియా కౌసర్, ఖాదర్ బీ, మస్తానమ్మ, చిట్టెమ్మ,షయాన్, బున్ను లు మహా శివుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వామిలు వారికి తీర్థప్రసాదాలు అందించారు
Reporter
Namitha News