నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 25 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో మొహరం పండుగ సందర్భంగా గురువారం తెల్లవారుజామున పెద్ద పీరు మెరవణి కార్యక్రమం వైభవంగా జరిగింది. మొహరం పండుగలో భాగంగా హిందూ ముస్లిం సోదరులు ఐకమత్యంతో పెద్ద పీరు తోపాటు పీర్లను భారీ ఎత్తున పూలతో అలంకరించి భక్తి శ్రద్దలతో ప్రత్యేక వాయిద్య బృందాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిగుండ ప్రవేశం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. పాత బస్టాండ్ నుండి క్రాస్ రోడ్, సిద్ధారెడ్డిగారిపల్లి, సాలె వీధి, దేవళం వీధి, మసీదు వీధి, విశ్వనాధ వీధిల లో పేర్ల ఊరేగింపు నిర్వహించారు. పీర్లకు బాసికాలు సమర్పణ, చదివింపులు కార్యక్రమం లో వందలాది మంది భక్తులు పాల్గొని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక రజక సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
Reporter
Namitha News