నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -మార్చి 13 : MSME –డెవలప్‌మెంట్ & ఫెసిలిటేషన్ ఆఫీస్ విశాఖపట్నం ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమల కేంద్రం , డి.ఆర్.డి.ఏ. మరియు మెప్మా అన్నమయ్య జిల్లా సహకారంతో మదనపల్లె లో నిర్వహిస్తున్న పి.యం. విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్ కమ్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదన రావు మదనపల్లి పట్టణంలోని శుక్రవారం ఉదయం శివాజీ నగర్, సీటీఎం రోడ్ వద్ద ఉన్న పద్మావతి కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ ప్రారంభించి స్టాళ్లను సందర్శించి కళాకారుల ఉత్పత్తులను పరిశీలించారు
ఈ సందర్భంగా డి.ఆర్.ఓ. మధుసూదన రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM విశ్వకర్మ పథకం ద్వారా సంప్రదాయ వృత్తుల కళాకారులకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందుతుందని తెలిపారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు నిర్వహించడం ద్వారా కళాకారుల హస్తకళా ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు పెరిగి వారి జీవనోపాధి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. మార్చి 13 నుండి 15 వరకు మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన కు సందర్శించారు. స్టాళ్లు ఏర్పాటు చేసి, వడ్రంగి, స్వర్ణకారులు, శిల్పులు, కుమ్మరి, కమ్మరి, ధోబీలు, బొమ్మల తయారీదారులు, పనిముట్ల తయారీదారులు, తాళాల తయారీదారులు, చెప్పుల తయారీదారులు, గంపలు/చాపలు తయారీదారులు, కొబ్బరి పీచు నేతకారులు, క్షురకులు, పూలదండల తయారీదారులు, చేనేత, చేపల వలల తయారీదారులు వంటి పలు సంప్రదాయ వృత్తులకు చెందిన కళాకారులు పాల్గొన్నారని,ఈ ఎగ్జిబిషన్ ద్వారా హస్తకళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే కాకుండా తయారీదారులు, వ్యాపారులు మరియు వినియోగదారులు పరస్పరం ప్రత్యక్షంగా కలుసుకునే వేదికగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు
ఈ కార్యక్రమం లో మురళీమోహన్ డైరెక్టర్ ఏపీ ఏం.ఎస్.ఏం.ఈ, డిసి., ప్రాజెక్ట్ డైరెక్టర్, మెప్మా పి.లక్ష్మీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ నాగేశ్వరరావు , ఆర్ సంజయ్ కుమార్ జాయింట్ డైరెక్టర్ ఎం.ఎస్.ఎం.మీ డిఎఫ్ఓ విశాఖపట్నం, ఎల్డిఎం జి.ఆంజనేయులు, టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, డాక్టర్ రాటకొండ గురు ప్రసాద్ కరస్పాండెంట్ అండ్ మెంబర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, పవన్ కుమార్ డైరెక్టర్ ఆర్.ఎస్.ఈ.టి.ఐ. ఎం నాగార్జున సీనియర్ మేనేజర్ ఐపిపిబి, విజయ్ విహారి డిప్యూటీ డెవలప్మెంట్ మేనేజర్ నాబార్డ్, తదితర సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు
Admin
Namitha News