నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 11 : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పి హరినాథ్ రెడ్డి ఈ దేశంలో అనేక సమస్యలు రైతాంగ కార్మిక ఉద్యోగ సామాన్య సమస్యలు పార్లమెంట్ లో ప్రస్తావన చేయకుండా సమస్యల నుండి తప్పించుకోవడానికి మతం మంటల్లో చలికాంచుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని వందేమాతరం 1924 లో రాచారని అందులో ఒక శరణం దుర్గాదేవిని పొగుడుతూ ఉన్నదని అందువల్ల వాటిని తొలగించి మిగతా వందేమాతర గీతం యధావిధిగా కొనసాగుతున్నదని భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేక కులాల అనేక మతాలు అనేక ప్రాంతాలు అనేక భాషలు భారతదేశంలో హిందూ మతం బౌద్ధమతం ఇస్లాం మతం జై నమ్మకం క్రిస్టియానిటీ ఉన్నాయని ఈ దేశంలో అందరూ సమానమే వాటిని గ్రహించకుండా పార్లమెంట్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనిగీతాన్ని ఇదే స్వతంత్ర పోరాటంలో ఏ మచ్చుకైనా కనబడని బిజెపి ఆర్ఎస్ఎస్ వాటి అనుబంధ సంఘాలు రచ్చ చేస్తున్నాయని తమిళనాడు రాష్ట్రం మదురై దగ్గర తిరుక్కునం గుట్ట వద్ద హిందూ దేవాలయం జైన మతం గుడి క్రిస్టియానిటీ చర్చ్ ఉన్నాయని వాటిపై అఖండ దీపం వెలిగేయాలని ప్రయత్నం చేస్తే వాటిని ఆ ప్రభుత్వం మతసామరస్యం కోసం అడ్డుకుంటే వాటిని రాజకీయ లబ్ధి కోసం బిజెపి రాద్ధాంతం చేస్తున్నదని ఆయన విమర్శించారు అలాగే ఈ రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు అని చెప్పుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో పోలవరం జాతీయ హోదా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఖర్చు పెట్టాలని రాజధానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టాలని అలాగే వెనకబడ్డ ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని వాటిని ఏవి రాబట్టకుండా ఈ ఒకటిన్నర సంవత్సరంలో దాదాపు రెండు లక్షల 30 కోట్లు అప్పు చేశారని రాజధానికి మరో 30 వేల కోట్లు అప్పు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఉత్పత్తి ద్వారా ఆదాయాన్ని పెంపొందించి తద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారని రాజధాని ప్రాంతానికి వేల ఎకరాలు చాలక మరో పదహారువేల ఎకరాలు భూసేకరణ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు రూపాయి విలువ పతనమవుతున్న కనీసం పార్లమెంట్లో చర్చ కూడా జరగలేదని రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ గాని బీహార్ గాని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమి తీర్మానం చేస్తే వాటిని గంగరెద్దులాగా తలలువుతున్నారని కనీసం లౌకిక పార్టీలుగా మాట్లాడలేదని రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పోలవరం నుండి బనకచర్ల మీదుగా కొత్తగా ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికే చేస్తున్నారని ఆయన విమర్శించారు ఈ నెల 18న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పేరుతో కార్పొరేట్లకు అప్పజెప్పడానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని ఇప్పటికే రాష్ట్రంలో విద్య 70 శాతం పైన ప్రైవేటు వ్యక్తులు కార్పొరేట్ చేతుల్లో ఉన్నాయని మెడికల్ కళాశాలలో ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తే వైద్యం పేదలకు ప్రైవేటు వారు అందిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు చెబుతున్నారని ప్రైవేటు వ్యక్తులు కోట్ల రూపాయలు వేచించి ఉచితంగా వైద్యం అందివ్వడం కలేనని ఆదాయమే పరమాదిగా ప్రైవేటు వ్యక్తులు చూస్తారని ప్రస్తుతం రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం ఉన్న వాటిని ఎన్ని కళాశాలలో అమలు చేస్తున్నాయని మెడికల్ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని వీటిని మానుకోవాలని కార్పొరేట్లకు మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆసుపత్రులను అప్పజెప్పేటువంటి విధానాలకు శక్తి పలకాలని ఆయన హితోపలికారు ఈ దేశంలో రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరలు లేవని రైతు పంట చేతికి వచ్చే సమయానికి ధరల పతనం అవుతున్నాయని ఈరోజు రాష్ట్రంలో అరటి పత్తి తదితర పంటలు ధరలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం పక్కన రైతు పండించే పంటలు ధాన్యాన్ని ప్రతి గింజను కొంటామని ప్రగల్బాలు పలుకుతున్న ఇప్పటిదాకా కొనడం ప్రారంభించలేదని ఆయన ఎద్దేవా చేశారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు హంద్రీనీవా కాలవలను పూర్తి చేసి మదనపల్లిలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీటిని మళ్ళించాలని తద్వారా నీటి ఎద్దడిని తీర్చాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సంయుక్త కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సాంబశివ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే మురళి లు పాల్గొన్నారు
Reporter
Namitha News