నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 16: అంగళ్లు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు యెన్.సి.సి విభాగానికి అసోసియేట్ యెన్.సి.సి ఆఫీసర్ గా సేవలు అందిస్తున్న యెన్.నవీన్‌కుమార్ కు లెఫ్టినెంట్ హోదా నుండి కెప్టెన్ హోదాకు పదోన్నతి పొందినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. మహారాష్ట్రలోని, కాంప్టీ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, సంబంధిత పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ పదోన్నతి లభించిందని తెలిపారు. యెన్.సి.సి కార్యక్రమాల అభివృద్ధి, శిక్షణా ప్రమాణాల మెరుగుదల, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి క్యాంపుల్లో కేడెట్లను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి ప్రశంసిస్తూ కల్నల్ ఎన్.వి మోనిష్, కమాండింగ్ ఆఫీసర్, లెఫ్టినెంట్ కల్నల్ పి.లోగనాథన్, అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు సిబ్బంది, 35-ఆంధ్ర బెటాలియన్, చిత్తూర్ వారి చేతులమీదుగా పదోన్నతి పత్రాలను అందుకున్నారు. కెప్టెన్ గా పదోన్నతి పొందిన యెన్.సి.సి ఆఫీసర్ నవీన్ కుమార్ ను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.
Admin
Namitha News