Sunday, 26 July 2026 02:48:13 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ లో యోలో మోడల్ ద్వారా ఆబ్జెక్ట్ డిటెక్షన్”పై ఒక రోజు హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్

ఐ.ఈ.ఐ. వారి ఆధ్వర్యంలో యోలో తరహా ఆబ్జెక్ట్ డిటెక్షన్

Date : 06 February 2026 08:14 PM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 06 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్) విభాగం వారు ఐ.ఈ.ఐ. వారి ఆధ్వర్యంలో “యోలో మోడల్ ద్వారా ఆబ్జెక్ట్ డిటెక్షన్” అనే అంశంపై ఒక రోజు హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నై, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ కె పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యోలో (కేవలం ఒక్కసారి మాత్రమే విశ్లేషించడం) మోడల్ ద్వారా చిత్రాలు, వీడియోల్లో వస్తువులను ఒక్కసారి విశ్లేషణతో వేగంగా, ఖచ్చితంగా గుర్తించే విధానాన్ని విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించారు. గత కొన్నేళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో యోలో మోడల్ కీలక పాత్ర పోషిస్తోందని, లైవ్ సెక్యూరిటీ కెమెరాలు, స్వయంచాలక వాహనాలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వంటి అనేక రంగాల్లో ఇది విస్తృతంగా ఉపయోగించబడుతోందని తెలిపారు. అలాగే వస్తువుల స్థానాన్ని బౌండింగ్ బాక్సుల రూపంలో చూపించే ప్రత్యేకత గురించి వివరించారు. పరిశ్రమల్లో నాణ్యత పరిశీలన నుంచి వైద్య రంగంలో ఎక్స్‌రే విశ్లేషణ వరకు యోలో వినియోగం పెరుగుతోందని అన్నారు. చిన్న ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్స్ చేయడం ద్వారా విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు సిద్ధమై ఉద్యోగ నియామకాలలో మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు . కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్.పద్మ , కోఆర్డినేటర్ పి.ఉదయ్ కుమార్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: