నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 22 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగము వారు మిట్స్ అల్యూమిని వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆమెరికన్ సొసైటీ సివిల్ ఇంజనీర్స్ (ASCE) మిట్స్ స్టూడెంట్స్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో అధునాతన సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణ పద్దతులపై మూడు రోజుల అవగాహనా వర్కుషాప్ ను ప్రారంభించారు.. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పూణే కి చెందిన హిల్టి టెక్నాలజీస్ కంపెనీ లో టెక్నికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కళాశాల పూర్వ విద్యార్ధి పి.కార్తీక్ పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సివిల్ ఇంజనీరింగ్ యొక్క పాత్ర ఎనలేనిదని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, శాస్త్రీయంగా రూపకల్పన చేయబడిన నిర్మాణాలు, వంతెనలు, రహదారులు, నీటి పారుదల వ్యవస్థలు, పట్టణ ప్రణాళిక – ఇవన్నీ సివిల్ ఇంజనీరింగ్ రంగానికి చెందినవన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సివిల్ ఇంజనీర్లు భవిష్యత్తు అవసరాలను తీర్చగల మౌలిక నిర్మాణాలను రూపొందిస్తున్నారు అని, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (BIM) వంటి నూతన సాంకేతికతలు సివిల్ ఇంజనీరింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చాయన్నారు. ప్రస్తుత ఆధునిక నిర్మాణ రంగంలో హిల్టి (Hilti) ప్రోఫిస్ ఇంజినీరింగ్ సూట్ అనేది నిర్మాణ ఇంజినీర్ల కోసం రూపొందించబడిన ఆధునిక ఇంటర్నెట్ ఆధారిత కంప్యూటింగ్ సేవల సమాహార ఆధారిత సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా నిర్మాణాలకు సంబంధించిన బేస్ ప్లేట్లు మరియు స్టీల్ కనెక్షన్ల రూపకల్పన (డిజైన్) మరియు విశ్లేషణను సులభంగా, ఖచ్చితంగా చేయవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుండైనా ఉపయోగించుకునే సౌకర్యం ఉండటం వల్ల ఇంజినీర్లు తమ పనిని వేగంగా మరియు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతున్నారు. నిర్మాణ భద్రతను పెంపొందించడంలో, డిజైన్ లోపాలను తగ్గించడంలో హిల్టి ప్రోఫిస్ ఇంజినీరింగ్ సూట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ ఆధునిక నిర్మాణ అవసరాలకు అనుగుణంగా ఇంజినీర్లకు నమ్మకమైన డిజైన్ పరిష్కారాలను అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగం మీదే ఆధారపడకుండా నిర్మాణ రంగంలోని ఉద్యోగాలలో కూడా రాణించవచ్చని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎన్.విజయ్ కుమార్, డీన్-స్కూల్ అఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగాశ్వేత, కోఆర్డినేటర్ కె. అనిత, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News