నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 03 ః తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ మాన్యం భూములను ఏడాదికి కౌలుకు వేలం పాటల ద్వారా రూ 13,314 ఉదయం లభించినట్లు టీటీడీ ఏఈఓ గోపీనాథ్ తెలిపారు. మంగళవారం వెంకటేశ్వర ఆలయంలో జరిగిన టెండర్ రహిత వేలం పాటలలో స్వామివారి మాన్యం 9.49 1/2 ఎకరాల భూమిని వ్యవసాయ సాగు వేలం పాటల నిర్వహించారు. ఈ వేలం పాటల ద్వారా రూ 13 314 ఆదాయం సమకూరింది. ఈ వేలం పాటల కార్యక్రమంలో తాసిల్దార్ లలితాంజలి, టిటిడి సిబ్బంది నగేష్, నాగరాజు, విజిలెన్స్ సిబ్బంది, వేలంపాటదారులు, ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News