నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం - జనవరి 03 : అన్నమయ్య జిల్లా పిటీఎం మండలం రాపూరి వాండ్లపల్లె సచివాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా పంచాయతీలో నిధులను ఏఏ పనులకు వినియోగించారో తెలుపాలని కృష్ణాపురం కు చెందిన కోనారెడ్డి రాజారెడ్డి సమాచారాన్ని గత సంవత్సరం జూన్ 06 కోరగా నిర్ణీత సమయానికి సమాచారం ఇవ్వకపోతే మొదటి అప్పీల్ గా పిటియం ఎంపీడీఓ కు దరఖాస్తు చేసుకొన్నారు, అప్పిలేట్ అధికారి అయిన ఎంపీడీఓ కూడా 45 రోజులు అయిన సమాచారాన్ని ఇవ్వలేదని తెలిపారు. కానీ సమాచార హక్కు చట్టం నెల రోజుల లోపు అయితే ప్రతి పేజీకి రెండు రూపాయలు చొప్పున తీసుకొని సమాచారాన్ని ఇవ్వాలి కానీ ఆరు నెలల గడుసున్న సమాచారాన్ని ఇవ్వనందుకు ఆ సమాచారాన్ని పూర్తిగా ఉచితంగా అధికారులే ఇవ్వాలని చట్టం చెబుతుంది కానీ చట్టాన్ని తుంగలో తొక్కి సమాచార హక్కు చట్టాన్ని చెత్త బుట్టలు వేస్తున్నారు, నిర్ణీత సమయంలో సమాచారాన్ని ఇవ్వకపోవడంతో సమాచార హక్కు కమిషనర్ కు అప్పీల్ చేసినట్లు తెలిపిన ఫిర్యాదు దారుడు రాజారెడ్డి
Reporter
Namitha News