నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 23 : ఢిల్లీ లో జరిగిన AI సదస్సు వేదికగా చైనా కుక్క బొమ్మతో (ROBO )దేశ పరువును మోడీ గారు తీస్తే, కాంగ్రెస్ శాంతియుత నిరసన తెలిపితే ఉగ్రవాదం అంటారా.. ప్రజల నుంచి కాంగ్రెస్ కు మద్దతు పెరుగుతుంటే చూసి ఓర్వలేక ఉగ్ర కోణం అని బిజెపి వాదించడం అత్యంత దారుణం. ఇది కేంద్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ సందర్భంగా Indian Youth Congress చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య హక్కు. పాలకులు తీసుకొనే నిర్ణయాలు సరిగా లేకపోతె ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు రాజ్యాంగ బంధం. అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు చర్చలు, సంభాషణల ద్వారా పరిష్కారం కనుగొనాలి గానీ, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం హేయమైన చర్య, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనంతపురం మరియు కర్నూలు జిల్లాల్లో కాంగ్రెస్ కార్యాలయాలపై దాడి చేయడం, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై దాడికి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ భేదాలను హింసగా మార్చడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచే చర్య. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. హింసకు బదులు చర్చ, ద్వేషానికి బదులు ప్రజాస్వామ్య సంభాషణ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ రోజు అధికారంలో ఉన్న బీజేపీ వారు రేపు ప్రతిపక్షంలో ఉండవచ్చు.... రేపు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తారు. అందుకే అధికారాన్ని అహంకారంగా కాక, బాధ్యతగా చూడాలి. శాంతి, సామరస్యాన్ని కాపాడటం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత. ప్రజలు హింసను తిరస్కరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం
Admin
Namitha News