నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్టోర్ కింగ్ కంపెనీ నందు విశ్వం ఇంజనీరింగ్ ఎంబీఏ విద్యార్థులకు ఆరు లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు కురబలకోట మండలం అంగళ్లు సమీపము నందు ఉన్న విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఫైనల్ ఇయర్ ఎంబీఏ చదువుతున్న విద్యార్థులకు ఆరు లక్షల ప్యాకేజీ తో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు పొందారు. రవితేజ, వేమన రాహుల్, ఆర్షియా, సాయి తేజ మరియు నందీష్ అనే విద్యార్థులకు బెంగళూరు కంపెనీ నందు పనిచేయుటకు ఆఫర్ లెటర్స్ ను అందించడం జరిగినది. విద్యార్థులు వివిధ రకాల కంపెనీలకు సెలెక్ట్ అవుతుండడంతో విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట శ్రీ ఎం ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ టీఎస్ గౌస్ బాషా,హెచ్ఓడి డాక్టర్ జి ఎల్ మీనా మరియు అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.
Reporter
Namitha News