Sunday, 26 July 2026 11:32:55 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తిరుమలరెడ్డిపల్లె లో సైబర్ నేరాలు పై అవగాహన

Date : 04 December 2025 07:31 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 04 : రామసముద్రం మండలం లోని పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీ తిరుమలరెడ్డిపల్లె గ్రామంలో సైబర్ నేరాలపై ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏ ఎస్సై హిమాచలపతి అధ్యక్షతన గురువారం క్రైమ్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఏ ఎస్సై మాట్లాడుతూ క్రైమ్, సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు గురువారం గ్రామంలో పర్యటించి గ్రామస్థులతో నేరుగా ముచ్చటించి వివిధ నేరాలపై భద్రత ప్రమాణాలపై గురించి ప్రజలకు క్లుప్తంగా వివరించారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను ఎదోవిధంగా మోసాలు చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారన్నారు. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరచిత వ్యక్తులు కాల్ చేసి మీకు ఓ టి పి వస్తుందని మీరు చెప్పాలని అని అడుగుతారని మీరు ఓ టి పి నంబర్ చెప్పకండి అని ప్రజలకు తెలియజేసారు. వర్షాలు పడే కాలం కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు దగ్గరకు వెళ్ళనీకుండా మీరు చూడాలన్నారు. మీ గ్రామంలో ఎవ్వరైనా అపరిచితులు సంచారం చేయడం, దోపిడీకి చేయడానికి ఆస్కారం ఉంటుందని అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మీకు ఎవ్వరిపైన సందేహం కలిగితే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఏ ఎస్సై హిమాచలపతి, కానిస్టేబుల్ బాలాజీ గ్రామస్థులు కైకాల కుమార్ స్వామి, సందూరి సర్దార్ బాషా,బాబుసాబ్(తారక్) వెంకటలక్ష్మమ్మ, చంద్రశేఖర్ రాజు,నారాయణ గౌడ్,సి. నారాయణ,ఆకుతోట నారాయణ, తిరుపతి నాయుడు,అనిల్ గౌడ్, దివ్యశ్రీ,చిన్ని, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: