Sunday, 26 July 2026 05:33:06 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో టిడిపి నాయకులు జయచంద్రారెడ్డి ని వదిలేసి మాజీ మంత్రి, బిసి నేత జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం దారుణం.... సిబిఐ దర్యాప్తు చ

Date : 02 December 2025 07:37 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : ములకలచెరువు నకిలీ మద్యం కేసులో టిడిపి నాయకులు జయచంద్రారెడ్డి ని వదిలేసి మాజీ మంత్రి, బిసి నేత జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం దారుణం.... సిబిఐ దర్యాప్తు చెస్తే అసలు దోషులు బయటకు వస్తారు.... ఇప్పటి వరకు జయచంద్రారెడ్డి ని అరెస్ట్ చేయకపోవడంలో ఉన్న కారణాలు ఏమీటీ -- సూటిగా ప్రశ్నించిన‌ మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ -- తంబళ్లపల్లె కోర్టు వద్ద ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తోకలిసి జోగి రమేష్ ను కలవడానికి వెళ్ళిన నిసార్ అహమ్మద్ నకిలీ మద్యం కేసులో అసలైన దోషి జయచంద్రారెడ్డిని వదిలేసి మాజీ మంత్రి, బిసి వైసిపి నేత జోగి రమేష్, జోగి రాము లను అరెస్ట్ చేయడం రాజకీయ కుట్రలో భాగమే అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ ఆరోపించారు. తంబళ్లపల్లె కోర్టు వద్ద ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తోకలిసి జోగి రమేష్ ను కలవడానికి నిసార్ అహమ్మద్ వెళ్ళారు. ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నాయకులు జయచంద్రారెడ్డి ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంలో వున్న కారణాలు ఏమిటని ప్రశ్నించారు. జయచంద్రారెడ్డి అసలు సూత్రధారి అంటూ సాక్షాత్తు టిడిపి వారే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపించారు. సిఎం చంద్రబాబునాయుడు కు వ్యతిరేకంగా మాట్లాడారనే అక్కసుతో జోగి రమేష్ ను అక్రమ కేసులో ఇరికించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. జోగి రమేష్, జోగి రాము పైన కుట్ర పూరితంగా కేసులు నమోదు చేసారని సిట్ దర్యాప్తు వద్దని సిబిఐ తో దర్యాప్తు చేయించి నిజాన్ని నిగ్గు తేల్చటానికి కూటమి ప్రభుత్వం సిద్ధం కావాలని సూచించారు. ‌కోర్డులు, దర్యాప్తు సంస్థలపై మాకు అపార నమ్మకం వుందని సిబిఐ దర్యాప్తుతోనే అసలు దోషులు బయటకు వస్తారని అన్నారు.‌ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: