నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 28 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని ఎన్జీఆర్, ఎస్ ఎల్ వి కళ్యాణ మండపాలలో జరిగిన మహానాడు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మద్ది రెడ్డి కొండ్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విడివిడిగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. భారీ కేకులు కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయికి ఎదగడానికి అన్న నందమూరి తారక రామారావు చేసిన కృషి తోపాటు అణగారిన వర్గాల ఆశాజ్యోతి గా నిలిచి చరిత్ర పుటాల్లో నిలిచిపోయారని కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో నిలిపిన ధీశాలి గా అభివర్ణించారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, క్లస్టర్ ఇన్చార్జిలు బేరి శ్రీనివాసులు, బిఎంఆర్,కాలా నారాయణ, దండువారిపల్లి రమణ, సలాది రాజశేఖర్ ,మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, పురుషోత్తం, వెంకట్ రెడ్డి, వీరాంజనేయులు, కురుబ సంఘం అధ్యక్షుడు సుధాకర్, గోపి దిన్ని మాజీ సర్పంచ్ లు ఉత్తమ రెడ్డి,సుధాకర్, జగదీష్, భాస్కర్, తాతిరెడ్డి, లక్ష్మీనారాయణ నాయుడు, మ్యూజికల్ శివ,మధు నాయుడు,జైపాల్ నాయుడు, పెద్ద వీరభద్ర,తెలుగు యువత నరసింహులు, గంగరాజు, మాజీ తెలుగు యువత నాయకుడు గురుమూర్తి ,నిజాముద్దీన్ , బోయపల్లి శివ,కోటకొండ చిన్నరెడ్డెప్ప, కోసూరి రెడ్డప్ప, మదన్ మోహన్, గ్రామ కమిటీ అధ్యక్షులు రామ్మూర్తి, నిజాముద్దీన్, రేణుమాకులపల్లి గ్రామ అధ్యక్షుడు సమీర్, తెలుగుదేశం సీనియర్ నాయకుడు సాలెహ, హాలి బై, అశోక్,రెడ్డప్ప నాయుడు, రెడ్డి కోట గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసులు ,నాగేంద్ర నాయుడు, బాబ్జాన్, శివకృష్ణ,ఆదిరెడ్డి, శేఖర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, మణి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News