నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లి - జూలై 02 : విబిజీ రాంజీ పథకం తో ప్రతి కుటుంబానికి 125 రోజులు పని కల్పించడమే వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకం(విబిజి రామ్ జి) ముఖ్య ఉద్దేశ్యం అని గురువారం డిప్యూటీ ఎంపిడివో లతో ఏపీఓ అంజనప్ప లు కలిసి ముఖ్యమంత్రి వర్యులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ ఏడాది జులై నెల 2 వ తేదీ నుండి ప్రారంభం కానున్న విబిజి రామ్ జి పథకం ఉపాధి హామి పథకం స్థానంలో అమలులోకి వచ్చిన దన్నారు.ఈ పథకంలో ముఖ్యంగా ప్రతీ కుటుంబానికి 125 రోజులు పని, రోజుకు 312 రూపాయలు వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. 15 రోజులలో పని చేసిన శ్రామికులకు వేతన చెల్లింపులు జరుగుతాయని, చెల్లింపులు ఆలస్యం అయితే ఆలస్యపు పరిహారం కూడా 0.05% శాతం శ్రామికులకు అందుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యత వుంటుందన్నారు. భూగర్భ జలాలు పెంచడానికి అధిక ప్రాధాన్యత వుంటుందని, వ్యవసాయ పనులు జరిగే కాలంలో రైతులకు కూలీలకు ఇబ్బంది కలుగకుండా 60 రోజులు పాటు ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు.అలాగే రైతులకు శాస్విత ఆస్తుల కల్పనకు తద్వారా రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో అంజనప్ప డిప్యూటీ ఎంపీడీఓ ఎంవి ప్రసాద్,మారుతి,ఏవో థామస్ రాజా,నాయకులు పురుషోత్తం, మధు, వెంకటరమణ, టీ.ఏ. లు, ఎఫ్ ఏ , ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు
Reporter
Namitha News