నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 30 : తంబళ్లపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేసి పదవీవిరమణ పొందిన నాగరాజుకు మండలంలోని పలు శాఖల అధికారులు, నాయకులు ఘనంగా సన్మానించారు,ఈ సందర్భంగా ఎంపిడిఓ ఉషారాణి మాట్లాడుతూ మంచికి,నీతికి,నిజాయితీకి,క్రమశిక్షణ కు మారుపేరుగా నాగరాజుకు సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు,అదేవిధంగా ఏపీఓ గంగాధర్ మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం అందుబాటులో ఉండి వారి మన్ననలను పొంది ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి నాగరాజు అని కొనియాడారు,అనంతరం ఆయన్ను పూలమాలలు తో,స్యలవలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడిఓలు వెంకట ప్రసాద్, మారుతి ప్రసాద్,ఏవో థామస్ రాజా,ఏపిఓ అంజనప్ప,మహిళ మండల సమైక్య అధ్యక్షురాలు రామలక్ష్మి,జూనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్, టైపిస్టు సురేంద్ర,పురుషోత్తం,సుధాకర్, కుటుంబ సభ్యులు భార్య వెంకటలక్ష్మి, కుమార్తె గౌతమి,కుమారుడు రెడ్డి నాగేంద్ర,యశ్వంత్, మండలంలోని కార్యదర్శిలు మరియు పంచాయతీ రాజ్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News