Sunday, 26 July 2026 12:26:52 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాద బాధితులకు 'పీఎం-రాహత్' వరం - రూ 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం

గోల్డెన్ అవర్‌లో స్పందిస్తే ప్రాణాపాయం నుంచి రక్షణ - సహాయం చేసిన వారికి రూ.25 వేల నగదు బహుమతి

Date : 06 May 2026 05:35 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 06 : రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పీఎం-రాహత్' (PM-RAHAT) పథకం ఒక గొప్ప వరమని, అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా ఈ 'నగదు రహిత చికిత్స' (Cashless Treatment) విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు

గోల్డెన్ అవర్.. ప్రాణాలకు ఆధారం! ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమైనదిగా ఎస్పీ అభివర్ణించారు. ఈ సమయంలో బాధితుడికి సరైన వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. "ప్రమాదం జరిగిన వెంటనే భయపడకుండా 112 నంబర్‌కు ఫోన్ చేస్తే అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి. బాధితులను వెంటనే నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స ప్రారంభించవచ్చు" అని ఎస్పీ తెలిపారు. పథకం విశేషాలు ఇలా ఉన్నాయి.. ఉచిత చికిత్స : ప్రమాదానికి గురైన వ్యక్తికి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించబడుతుంది. ఏడు రోజుల పరిమితి : ప్రమాదం జరిగిన రోజు నుండి వరుసగా 7 రోజుల పాటు నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స పొందవచ్చు. ఎవరెవరు అర్హులు... ? రోడ్డుపై నడిచే పాదచారులు, సైకిల్ దారులు, ద్విచక్ర వాహనదారులు, డ్రైవర్లు మరియు విదేశీయులు సైతం ఈ పథకానికి అర్హులే. నిబంధనలు : ప్రమాదం జరిగిన అనంతరం వీలైనంత త్వరగా, సాధారణంగా 24 గంటల లోపు బాధితుడిని ఆసుపత్రిలో చేర్చితే పథకం ప్రయోజనాలు సంపూర్ణంగా పొందే అవకాశం ఉంటుంది. సహాయం చేసే వారికి 'రక్ష'.. నగదు బహుమతి : ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించే ‘గుడ్ సమారిటన్ (రహ-వీర్)’లకు ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. బాధితులను కాపాడిన వారికి పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని, పైగా వారి సాహసాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం రూ.25,000 వరకు నగదు బహుమతిని అందజేస్తుందని ఆయన వెల్లడించారు. పోలీసు శాఖకు సమాచారం అందిన 24 గంటల్లోనే ప్రమాద ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసి, వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు

ఎస్పీ గారి విజ్ఞప్తి మీ ఒక్క అడుగు ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సాక్ష్యంగా ఉండాల్సి వస్తుందని భయపడకండి. మానవత్వంతో స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించి పీఎం-రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలి" అని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: