Monday, 27 July 2026 04:18:28 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య లో ఆవిష్కరణలు, వ్యాపారోత్పత్తి పై అవగాహన

Date : 17 March 2026 07:59 PM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 17 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మరియు డేటా సైన్స్) విభాగాల వారు సంయుక్తంగా ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో ఇంజినీరింగ్ విద్యలో ఆవిష్కరణలు మరియు వ్యాపారోత్పత్తి అభివృద్ధి అనే అంశం పై ఒక రోజు సాంకేతిక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడుకు చెందిన అన్న యూనివర్సిటీ నందు మెకానికల్ విభాగం లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఎమ్.సత్య ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఇంజినీరింగ్ విద్య కేవలం తరగతి గది పాటలకే పరిమితం కాకుండా, ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకత కేంద్రంగా సరికొత్త దిశలో ముందుకు సాగాలని అన్నారు. నేటి ఇంజినీర్లు కేవలం డిగ్రీలు పొందే వారు మాత్రమే కాకుండా, సమాజంలోని సంక్లిష్ట సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొనే దిశగా ముందుకు సాగాలని అన్నారు. హ్యాకథాన్‌లు మరియు డిజైన్ థింకింగ్ వంటి వేదికల ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను ప్రాథమిక నమూనాలుగా అభివృద్ధి చేయాలని అన్నారు. విదేశీ సాంకేతికతలను అనుసరించడం కంటే భారతీయ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలకు సరిపోయే విధంగా, తక్కువ ఖర్చుతో, స్థిరమైన పరిష్కారాలను రూపొందించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. భారతీయ పరిస్థితులకు సరిపోయే సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా దేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతుందని తెలుపారు. ఈ ప్రక్రియలో మిట్స్ యూనివర్సిటీ నందు బిజినెస్ ఇంక్యుబేటర్లు మరియు స్టార్టప్ హబ్‌లు విద్యార్థులకు మార్గదర్శకత్వం మరియు అవసరమైన వనరులు అందిస్తూ సాంకేతిక ప్రాజెక్టులను లాభదాయకమైన వ్యాపారాలుగా మార్చడంలో సహకరిస్తున్నాయని అన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృత్రిమ మేధ (AI), గ్రీన్ ఎనర్జీ మరియు సెమీకండక్టర్ల వంటి ఆధునిక రంగాల అభివృద్ధికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ చంద్ర ప్రకాష్ గుప్తా , విభాగాధిపతులు డాక్టర్ ఆర్ కల్పనా, ఎస్.కుసుమ, కోఆర్డినేటర్ డాక్టర్ ఏ.పుంగోదై, డాక్టర్ కె.నిర్మల దేవి, డాక్టర్ చొక్కనాథన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :