Monday, 27 July 2026 05:43:15 PM
# కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు

తంబళ్లపల్లె లో 30 వేల జనసేన సభ్యత్వమే మా లక్ష్యం -మైఫోర్స్ మహేష్

Date : 01 March 2026 07:44 PM Views : 247

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 01 : తంబళ్లపల్లె నియోజకవర్గంలో 30 వేల జనసేన పార్టీ సభ్యత్వం చేపట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తంబళ్లపల్లెకు రప్పించడమే తమ లక్ష్యమని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై ఫోర్స్ మహేష్ , సద్ది కూటి హరినాథ్ తెలిపారు. ఆదివారం పాత జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో జనసేన సభ్యత్వ నమోదు కార్యకర్తల సమావేశం జరిగింది . ఈ సందర్భంగా మై ఫోర్స్ మహేష్, జనసేన నియోజకవర్గ నాయకుడు సద్దికూటి హరినాథ్ లను స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి తంబళ్లపల్లె పురవీధుల్లో జనసేన జిందాబాద్, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మై ఫోర్స్ మహేష్ మాట్లాడుతూ గత దశాబ్దకాలంగా తంబళ్లపల్లెలో జనసేన ఆధ్వర్యంలో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టానని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త జనసేన క్రియాశీలక పార్టీ సభ్యత్వం చేపట్టాలని పిలుపునిచ్చారు. నీతి నిజాయితీ కి మారుపేరైన పవన్ కళ్యాణ్ ఆశయ సాధన తో తంబళ్లపల్లె నియోజకవర్గం లో అందరినీ కలుపుకొని జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీ అభివృద్ధి కోసం పోరాటం చేస్తానన్నారు. తంబళ్లపల్లెలో జనసేన కార్యకర్తలకు ఏ సమస్య వచ్చిన నా తమ్ముడు సద్దికూటి హరినాథ్ అందుబాటులో ఉంటాడని హామీ ఇచ్చారు. సద్దికూటి హరినాథ్ మాట్లాడుతూ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేయాలని నేడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడటానికి ప్రతి కార్యకర్త సమిష్టి కృషితో పనిచేయాలని కోరారు. సభ్యత్వ నమోదులో చొరవ చూపి రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేయించాలన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో మహేష్ అన్న సహకారంతో జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు రాజారెడ్డి, ఎద్దుల నరసింహులు, ఆర్కె,రఘు, సురేష్, విజయ్ కుమార్ రెడ్డి, అరవింద్, రెడ్డప్ప, రెడ్డి ప్రసాద్, కార్తీక్, బిజెపి మండల అధ్యక్షుడు రమణ, మాజీ అధ్యక్షుడు రామస్వామి రెడ్డి, ఆరు మండలాల జనసేన మండల నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :