Sunday, 26 July 2026 04:43:36 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

హిందూ సమ్మేళనం లో మహాపీఠం పీఠాధిపతులు మాతంగా నందగిరి స్వామీజీ

Date : 04 January 2026 10:36 PM Views : 263

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 04 : రామసముద్రం మండల కేంద్రం లో హిందూ సమ్మేళనం ను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సమ్మేళనం సందర్భంగా రామసముద్రం లో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి హిందూ సమ్మేళనంలో పాల్గొన్నారు. దిగువపేటలోని శ్రీ చంద్ర శేఖర స్వామి ఆలయం దగ్గర నుండి హిందువులు వివిధ రకాల కళాకారులు అక్కడి నుండి ర్యాలీగా శ్రీరాములవారి పాటలకు నృత్యాలు చేస్తూ చెక్కభజనను కోలాటాలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేషధారణతో శివాజీ వేషధారణతో ర్యాలీ కొనసాగింది. అక్కడ నుండి చెక్ పోస్ట్ మీదుగా హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా హిందూ సమ్మేళన ప్రాంగణ సభ స్థలానికి భారీ ఎత్తున చేరుకొని హిందూ సమ్మేళనం అంటే ఏంటి మనం ఎందుకు నిర్వహించుకున్నాం మన హైందవ ధర్మాన్ని ఎలా పాటించాలి మన భారత పరిరక్షణ ఎలా ఉండాలి అనే అంశాల మన భారత పరిరక్షణ ఎలా ఉండాలి అనే అంశాల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ పూజ శ్రీ మతంగ నందగిరి స్వామీజీ శ్రీ మతంగా మహాపీఠము పీఠాధిపతులు శ్రీ పూజ శ్రీ మతంగ నందగిరి స్వామీజీ శ్రీ మతంగా మహాపీఠము పీఠాధిపతులు, దేవరెద్దులు లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా నిత్యముకదాస్, సుదర్శన్ కృప దాస్, శివరామ దాస్ వారు విచ్చేసి వారి యొక్క ముఖ్య సందేశాన్ని హిందూ బంధువులకి వినిపించారు. చిన్నారుల చేసిన భరతనాట్యం, కోలాటం, చెక్కభజనలు ప్రజలను ఎంతగానో మెప్పించాయి.హిందూ సమ్మేళన నిర్వాహకులు సమితి వారు తెలిపారు. కావున ఆత్మీయ హైందవ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని భారతదేశానికి ఆత్మ ప్రాణ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం. అటువంటి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసే సమైక్యపరచి మన దేశాన్ని విశ్వా గురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో "రాష్ట్రీయ స్వయం సేవక్ సంమ్"1925 లో ప్రారంభించబడింది సంఘ ప్రయాణంలో 100 సంవత్సరాలు నిర్మాత కృషిని, మన సఫల కార్యక్రమాన్ని ఒకసారి సింహవలోకనము చేసుకుంటూ భవిష్యత్తు సాధన మార్గాన్ని దర్శిస్తూ ఈ మహా శ్రత్కారంలో హిందూ బంధువులందరికీ భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది. వచ్చిన భక్తులకు ప్రజలకు గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎలాంటి అవార్చనయ సంఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ ఎక్కడికక్కడ నియంత్రణ చేసిన ఎస్ఐ ఉమామహేశ్వర్ రెడ్డి పోలీస్ సిబ్బంది.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నిర్వహకులు,అన్ని కుల సంఘ నాయకులు,వివిధ రకాల కళాకారులు,హిందూ సంఘ సేవకులు,అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు,హిందూ బంధువులు,తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: