నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 24 : ప్రతి విద్యార్థి పెద్దలు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్య విజయానికి తొలిమెట్టుగా నిలుస్తుందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ సూచించారు. మంగళవారం హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలలో భాగంగా జడ్పీ హైస్కూల్లో 48 మంది టెన్త్ విద్యార్థులకు పరీక్షల సందర్భంగా పరీక్షల కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల కమిటీ చైర్మన్ సుగవాసి శివకుమార్, హెచ్ఎం శ్రీనివాసులు, అధ్యాపకులు హెల్పింగ్ మైండ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ స్ఫూర్తి దాయకమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మైనుద్దీన్, సురేంద్రనాయక్, దొరస్వామి నాయుడు, సునీల్, వెంకటరమణ, చంద్రయ్య, ప్రతాపరెడ్డి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు బషీర్, సిరాజ్, కళ్యాణ్, అబ్దుల్లా, అమీన్, సైసావలి విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News