Monday, 27 July 2026 09:50:56 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

జనవరి 4వ తేదీన భూ పోరాట జిల్లా సదస్సును జయప్రదం చేయండి - సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప

జనవరి నెల 18వ తేదీన ఖమ్మం లో సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు సభ

Date : 02 January 2026 08:04 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. . కొత్తకోట - జనవరి 02 : జనవరి నెల 18వ తేదీన ఖమ్మం లో సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు సభ కు గౌరవార్థంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికేఎంయు) మరియు భారత కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీ ఆదివారం రోజున బి.కొత్తకోట మండలం లోని బీరంగి గ్రామం టానామిట్ట వద్ద జరిగే భూ పోరాట జిల్లా సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప, నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి లు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బీరంగి గ్రామంలోని టానామిట్ట వద్ద సదస్సుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ; పేదల సాగు మరియు నివాసంలో ఉన్న భూములకు పట్టాలు పంపిణీ చేయాలని,కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలుపై, అసైన్డ్ చట్ట సవరణపై ఈ యొక్క సదస్సులో చర్చించి పోరాట రూపకల్పన చేయడం జరుగుతుందని,ఈ యొక్క సదస్సుకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల.ఈశ్వరయ్య,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రామానాయుడు,వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు బి.కేశవరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్ తదితర నాయకులు పాల్గొంటున్నారని భూ పోరాటాలే ప్రధాన అజెండాగా జరుగుతున్న ఈ యొక్క సదస్సుకు నియోజకవర్గంలోని వ్యవసాయ కార్మికులు,పార్టీ మరియు అనుబంధ సంఘాల కార్యకర్తలు అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సదస్సును జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పి.నారాయణస్వామి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి హరికుమార్,శంకర,లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :