నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 08 : అఖిలభారత సాకేంతిక విద్యా మండలి (ఏ ఐ సీ టి ఈ)న్యూ ఢిల్లీ వారి సహకారంతో మదనపల్లి సమీపం లోని మిట్స్ డీమ్డ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ విభాగము వారు వారం రోజుల పాటు స్మార్ట్ సీటీ మరియు మొబిలిటీ డెవలప్మెంట్ పై ఫాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను మిట్స్ డీమ్డ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ డాక్టర్ సి. యువరాజ్, విభాగధిపతి డాక్టర్ ఎస్. కుసుమ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పి. మంజులకు అభినందనలు తెలియచేసారు. ఈ సదస్సుకు సహాయ, సహకారం అందించిన అఖిల భారత సాకేంతిక విద్యా మండలి వారు ఒక లక్ష రూపాయలు నగదు సహకారాన్ని అందించారు. ఈ సహాయ సహకారాలను అందించిన అఖిల భారత సాకేంతిక విద్యా మండలి వారి కి మిట్స్ డీమ్డ్డ్ యూనివర్సిటీ ఛాన్సిలర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సిలర్ ఎన్. ద్వారకానాథ్, వైస్ ఛాన్సిలర్ డాక్టర్ సి. యువరాజ్ కృతజ్ఞతలు మరియు విజయ వంతంగా పూర్తిచేసిన అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.
Admin
Namitha News