నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - డిసెంబర్ 26 : ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని 22ఏ మరియు చుక్కల భూముల సమస్యలపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం నాడు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. పలు కారణాల వల్ల 22ఏ మరియు చుక్కల భూములకు సంబంధించిన యన్.ఓ.సీ లు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయన్న విషయం విధితమే. ఈ భూముల పరిష్కారానికి శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించి జిల్లా యంత్రాంగానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నేడు 22 ఎకరాల 62 సెంట్ల భూములకు సంబంధించిన బాధితులకు యన్.ఓ.సి. లను నేడు జారీ చేశామన్నారు. మదనపల్లి మండలానికి చెందిన శ్రీలత, భాస్కర్, కానాల చెంగమ్మ, హేమలత, నందకిషోర్,మరియు కురబలకోట మండలానికి చెందిన మస్తాన్ రెడ్డి లకు ఈ సందర్భంగా ఎన్ఓసీ లను జారీ చేశామని పేర్కొన్నారు. ఈరోజు మరో 15 ఎకరాల 28 సెంట్ల 22 ఏ భూములకు సంబంధించిన 10 కేసులను విచారణ చేపట్టామని వీటికి సంబంధించిన యన్.ఓ.సీ లను సోమవారం నాడు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో పెండింగ్ లో నున్న 22ఏ మరియు చుక్కల భూముల సమస్యలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని త్వరలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, రికార్డుల ఫోర్జరీ కేసులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. యన్.ఓ.సీ లను పొందిన లబ్ధిదారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో నున్న తమ 22ఏ భూముల సమస్యలు పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, జిల్లా కలెక్టర్ కు, జిల్లా పాలన యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు
Reporter
Namitha News