నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 10 : తెదేపా మండల పార్టీ నాయకులు గౌనివారి విజయ్ కుమార్ గౌడ్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాను వున్నాను అంటూ టీడీపీ క్యాడర్ కు భరోసా కల్పించి నాడు సేవలు అందించారు. ఈ సేవలకు ఫలితమే నేడు ఐ వి ఆర్ ఎస్ ఓటింగ్ నందు విజయ్ కుమార్ గౌడ్ రెండవ సారి గెలుపొంది పార్టీ అధిష్ఠానం నుండి మరో సారి బాధ్యతలు స్వీకరించనున్నారు. నాడు పార్టీకి చేసిన సేవలే మరోమారు మండల పార్టీ పగ్గాలు అందుకున్నారు. తన పదవికాలంలో ప్రతిక్షణం ప్రజల పక్షంగా సేవలు అందించి పార్టీ బలోపేతంకు కృషి చేసినందుకు రెండవ సారి అదృష్టం వరించింది. దీంతో మండల కేడర్ లో ఫుల్ జోష్లో ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Admin
Namitha News