నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 13 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లో ఊర కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ కుక్కలు తంబళ్లపల్లెలోని ప్రధాన రహదారులలో సంచరిస్తుండడంతో చిన్నారులు, విద్యార్థులు అటువైపు వెళ్లడానికి భయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుక్కల సంచారంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ కుక్కల సంచారం పై పంచాయతీ అధికారులతో పాటు మండల స్థాయి అధికారులు సైతం పట్టించుకోకపోవడం పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శునకాల బెడద లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Reporter
Namitha News