Sunday, 26 July 2026 10:57:06 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 16 April 2026 10:07 PM Views : 264

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 15: అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎర్రచందనం కేసుల పురోగతిపై ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ.... కేవలం నిందితులను అరెస్ట్ చేయడం మాత్రమే కాకుండా, వారికి కోర్టులో కచ్చితంగా శిక్ష పడేలా బలమైన సాక్ష్యాధారాలను సేకరించాలి. చార్జ్ షీట్లను గడువులోపు దాఖలు చేయాలి. సాక్షుల విచారణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిరంతరం కోర్టు వ్యవహారాలను పర్యవేక్షించాలి. గతంలో ఎర్రచందనం కేసుల్లో ఉన్న వారి కదలికలపై నిఘా ఉంచాలి. పరారీలో ఉన్న ముద్దాయిలు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారి కోసం అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారిని పట్టుకోవాలి. స్మగ్లింగ్ జరిగే ప్రధాన మార్గాలను గుర్తించి, చెక్ పోస్టుల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలి. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు, కోర్టు సిబ్బంది మరియు క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం.వెంకటాద్రి గారు, మదనపల్లి డిఎస్పీ బి.పావని గారు, పలువురు సీఐలు, ఎస్ఐలు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: