నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 27 : తంబళ్లపల్లె నియోజకవర్గం తో పాటు సత్య సాయి, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతోపాటు కర్ణాటక రాష్ట్ర పరిధిలోని లక్షలాదిమంది భక్తులు, ప్రజల ఆరాధ్య దైవం మల్లయ్య కొండ మహాశివుడు వెలసిన సాధు మల్లయ్య కొండల్లో మైనింగ్ చేపడితే పార్టీలు, ప్రాంతాలకతీతంగా అన్ని వర్గాలు ప్రజలు అడ్డుకొని ప్రాణాలైనా అర్పిస్తామని కొండలను కాపాడుకుంటామని ప్రభుత్వాలకు అల్టిమేట్ జారీ చేశారు. బుధవారం ఉదయం మైనింగ్ అధికారి సత్యనారాయణ తోబాటు ముగ్గురు అధికారులు మల్లయ్య కొండ అంతర్భాగంలోని సాదుకొండ అడవి అటవీ ప్రాంతం లో 87 హెక్టార్ల భూమిని సర్వే నిర్వహించడానికి ఫారెస్ట్ అధికారులతో కలసి బయలుదేరారు. విషయం దావాణలంగా వ్యాపించడంతో అటవీ శివార్ల గ్రామాలు బోరెడ్డివారి కోట, ఎగువ బోయపల్లి, దిగువ బోయపల్లి, చెవిటివారిపల్లి, కే.మేకల వారి పల్లి, బాలకవారిపల్లె, తంబళ్లపల్లి కు చెందిన శివ భక్తులు, రైతులు, కూలీలు, ప్రజలకు తోడుగా వైకాపా నాయకులు మైనింగ్ అధికారులను అడ్డుకున్నారు. వారిని సాధు కొండ అటవీ ప్రాంతం నుండి తంబళ్లపల్లె మండల కేంద్రానికి తరలించి క్రాస్ రోడ్లో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించడంతో తంబళ్లపల్లెలో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించి వాహనాలు నిలిచిపోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. లక్షలాదిమంది భక్తుల మనోభావాల కు నిలయమైన పవిత్రమైన మల్లయ్య కొండలు మైనింగ్ కు అప్పగిస్తే సహించేది లేదని కొండలను కాపాడుకోవడానికి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ అడ్డుకుని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సాదు కొండ నుండి ఇనుము కొండ సొరంగ మార్గం మీదుగా మల్లయ్య కొండకు మల్లికార్జున స్వామి సంచరించిన పుణ్యస్థలమని నేడు మల్లయ్య కొండ విస్తృతంగా అభివృద్ధి చెంది ప్రతిరోజు వందలాది మంది భక్తులు రాకపోకలు సాగించి ఆ మల్లయ్య కొండ స్వామి దర్శించుకుంటారు.ఇలాంటి పరమ పవిత్రమైన కొండలను ధ్వంసం చేయాలని చూస్తే తంబళ్లపల్లె నియోజకవర్గం కన్నెర చేసి రణరంగంగా మారడం ఖాయమని మైనింగ్ అధికారులను ఘాటుగా హెచ్చరించారు. లక్షలాది జీవరాసులు, మూగజీవాలకు పశుగ్రాసం, వేలాదిమందికి జీవనోపాధి, దేశంలో ఎక్కడా లేని విధంగా విలువైన కలప, వనమూలికలు దొరికే ఈ ప్రాంతం పచ్చటి పర్యావరణంతో విరాజిల్లుతున్న ఈ కొండలు ధ్వంసం అయితే పర్యావరణం కాలుష్యంతో పాటు జీవనోపాధి కోల్పోయి వేలాదిమంది శ్రామికులకు ఉపాధి కరువై, పశుగ్రాసం లేక పశువులు, పక్షులు వన్యప్రాణులు, అన్ని రకాలుగా నష్టపోతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాస్ రోడ్ లో ధర్నా రాస్తారోకో నిర్వహిస్తున్న ప్రజలనుదేశించి మైనింగ్ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడానికి వచ్చామని కొండల పవిత్రతపై మీరు ఇచ్చే సందేశాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పడంతో ప్రజలు ధర్నా విరమించారు. అనంతరం మూకుమ్మడిగా తాసిల్దార్ కార్యాలయం చేరుకొని మల్లయ్య కొండలు మైనింగ్ కు అప్పగిస్తే ఈ ప్రాంతం స్మశాన వాటిక తలపిస్తుందని మల్లయ్య కొండను మైనింగ్ రహిత ప్రాంతంగా ప్రకటించాలని లిఖిత పూర్వపు ఫిర్యాదు చేశారు. తాసిల్దార్ శ్రీనివాసులు వారి ఫిర్యాదుకు స్పందించి ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, అటవీ శివార్ల గ్రామాల రైతులు, కూలీలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం
Reporter
Namitha News