నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 20 : పుంగనూరు పట్టణం లోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. వెంకటేశులు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం పరిసరాలను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా, సంపన్నంగా మార్చడమే ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ముఖ్యంగా పరిశుభ్రత, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టారని ఆయన పేర్కొన్నారు. చెత్తను వేరు చేయడం, రీసైక్లింగ్ చేయడం, వ్యర్థాల నుండి సంపత్తి సృష్టించడం వేస్ట్ టు వెల్త్ వంటి అంశాలపై అవగాహన కల్పించామని డా. వెంకటేశులు తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడం, హరిత వాతావరణాన్ని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. అదేవిధంగా విద్యార్థులు కళాశాల ఆవరణను పరిశుభ్రపరిచి, మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. సోమరాజులు, కె. అనిల్ కుమార్, డాక్టర్ టి. శ్రీనివాస్, పి.ఏ. షాహిదాబాను, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News