నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 13న జరిగే ఏఎంసి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాని తరలిరండి - డైరెక్టర్ బర్నేపల్లి సంధ్యారాణి రవికుమార్ పిలుపు మదనపల్లె : ఈనెల 13వ తేదీ అనగా గురువారం జరిగే మదనపల్లి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి బిజెపి,జనసేన,టిడిపి నాయకులు తరలిరావాలని డైరెక్టర్ బర్నేపల్లి సంధ్యారాణి రవికుమార్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడుతూ నీరుగట్టువారి పల్లిలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానిక మంత్రులు సత్యకుమార్ యాదవ్,నాదెండ్ల మనోహర్,మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కూటమి పార్టీలకి చెందిన ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు.రాష్ట్ర అభివృద్ధి,ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు.ఏపి అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.ప్రజల రాజధాని అమరావతి,ఏపీ జీవనాడి పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.దీంతో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని కొనియాడారు.అదేవిధంగా మదనపల్లె జిల్లా ఏర్పాటుకి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలపడంతో ఇక్కడ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందని హర్షం వ్యక్తం చేశారు.తనను మార్కెట్ కమిటీ డైరెక్టరుగా నియమించినందుకు బిజెపి అధిష్టానానికి,కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం,టమోటా రైతుల శ్రేయస్సు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.
Reporter
Namitha News