నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 28 : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ జడ్.పి.హెచ్.ఎస్. విద్యార్థులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి 69వ ఎస్జీఎఫ్ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ నందు ఖేలో ఇండియా ఫెన్సింగ్ లో గుర్రంకొండ జడ్పి హై స్కూల్ విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మెడల్స్ సాధించారు. P. హరినాథ్ రెడ్డి ఇండూజ్యూవల్ సిల్వర్ మెడల్, ప్రసన్న కుమార్ ఇండూజ్యూవల్ సిల్వర్ మెడల్ సాధించారు. వీరు త్వరలో మహారాష్ట్ర శంభోశం నగర్ లో జరగబోయే జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ నందు పాల్గొంటారు. పథకాలు సాధించినటువంటి విద్యార్థులకు హెచ్ఎం తకివుల్లా, స్కూల్ అసిస్టెంట్ లక్ష్మీ అభినందించారు. ఈ కార్యక్రమం నందు ఖేలో ఇండియా ఫెన్సింగ్ కోచ్ రవీంద్రనాథ్, పిడి శ్రావణి, మరియు పద్మలత మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Admin
Namitha News