నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 17 :: ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భవిష్యత్తులో ప్రతి ఇంట సోలార్ విద్యుత్ వెలుగులు నింపడానికి విద్యార్థులు నడుం బిగించాలని విద్యుత్ శాఖ డి.ఈ గంగాధరం పిలుపునిచ్చారు. బుధవారం ఎంఈఓ త్యాగరాజు ఆధ్వర్యంలో కోసువారిపల్లె హైస్కూల్లో సోలార్ విద్యుత్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఈ మాట్లాడుతూ నేడు బొగ్గు ధర పెరిగి విద్యుత్తు ఉత్పత్తి కష్టతరంగా ఉందని రాబోయే రోజుల్లో సోలార్ విద్యుత్తుతో నాణ్యమైన విద్యుత్తు తో పాటు అదనపు విద్యుత్తుతో ఆదాయం పొందవచ్చు అన్నారు.విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రతి ఇంట సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేలా సూచించాలన్నారు. సోలార్ విద్యుత్తు వాడకానికి తమ వంతు సహకారం అందిస్తామని విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. ఎంఈఓ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇంధన పొదుపు పాటించి విద్యుత్ వాడకం తగ్గించి సోలార్ విద్యుత్ పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి భవిష్యత్తు కోసం ఓ ఉద్యమంలా సోలార్ వెలుగులకు ఊతమివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడిలు గోవిందరెడ్డి, సురేంద్రనాయక్, ఏ ఈ సురేంద్ర, సబ్ ఇంజనీర్ శేషుబాబు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, హై స్కూల్ హెడ్మాస్టర్, అధ్యాపకులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News