నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 24 ః తంబళ్లపల్లె మల్లయ్య కొండ కింద కమ్యూనిటీ హాల్ లో ఈనెల 25 మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే టిడిపి మండల కమిటీ సమావేశానికి మండలం లోని 21 పంచాయతీల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తరలి రావాలని రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి తంబళ్లపల్లి జోన్ అబ్జర్వర్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు, అబ్జర్వర్ ఆర్జే వెంకటేష్ ల ఆధ్వర్యంలో టిడిపి మండల కమిటీ ఎన్నిక జరుగుతుందని కావున తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడు తప్పక హాజరై తమ అభిప్రాయాన్ని పార్టీ పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లి మండలంలో పార్టీకి జీవం పోయాలని ఓ ప్రకటనలో కోరారు.
Reporter
Namitha News