నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 22 : తంబళ్లపల్లె మండలం లో పేకాట స్థావరాలపై తంబళ్లపల్లె ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి సారద్యం లో దాడి చేశారు. పరస తోపు పంచాయితీ దాదం వడ్డిపల్లి సమీపంలోని బోడిగుట్ట సమీపంలో పేకాట ఆడుతుండగా ఎస్సై తన సిబ్బందితో దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకోగా ఐదు మంది పరార్ అయ్యారు. నిందితుల పై కేసు నమోదు చేసి వారి నుండి రూ 16,790 సొమ్ము, నాలుగు మొబైల్ ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరు పరచ నున్నట్లు ఎస్ఐ ఉమామహేశ్వర్ రెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ పేకాట దాడిలో ఏఎస్ఐ నజీర్ భాష, సిబ్బంది శివశంకర్ రెడ్డి, వెంకటేష్, మహిళా పోలీస్ మంజుల పాల్గొన్నారు
Reporter
Namitha News