Monday, 27 July 2026 03:31:10 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఎస్పీ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ - ఎస్ టు లైఫ్ నినాదం తో 3కె రన్

Date : 07 February 2026 12:24 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 07 : అంగళ్ళు సమీపం లో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వారు అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ సహకారంతో "సే నో టు డ్రగ్స్ - ఎస్ టు లైఫ్" అనే నినాదంతో 3 కిలోమీటర్ల రన్ ను చేసిన విద్యార్థులు, ఈ సందర్బంగా విద్యార్థులలో డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనర్థాల పై అవగాహన కొరకు ఈ కార్యక్రమం ను నిర్వహించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాల్గొన్నారు

ఈ సందర్బంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు మరియు సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, క్రీడలు, వ్యాయామం మరియు సానుకూల ఆలోచనలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మంచి మార్కులు సాధించడం, క్రీడలు లేదా ఇతర రంగాల్లో నైపుణ్యం సంపాదించడం ముఖ్యమని, చెడు వ్యసనాలకు లోను కాకూడదని ఆయన అన్నారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల విద్యార్థులు సాధించే లక్ష్యాల పై ప్రభావం చూపుతాయని, వాటికి దూరంగా ఉండి విజయాలు సాధించాలని ఆయన అన్నారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు లోనైన విద్యార్థులు ఎవరైనా ఉంటె మాకు సమాచారం అందించాలని, అందించిన వారి సమాచారాన్ని గౌప్యాంగా ఉంచుతామని అన్నారు. సమాచారం తమకు ఇవ్వడం వల్ల ఒక కుటుంబానికి మీరు మేలు చేసిన వారు అవుతారని ఆయన అన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ యువతకు మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ 3కే రన్‌లో విద్యార్థులు, యువత, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తమ మద్దతును ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో అవగాహన పెంపొందించి వారిని సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. విద్యార్థులు మిట్స్ ఏం.ఎస్.ఆర్ క్లబ్ వాలు డ్రగ్స్ పై స్కిట్ ను వేసి శ్రోతలను అలరించారు. తరువాత ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జెండా ఊపి 3కే రన్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమం లో యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఫై. రామనాథన్, అడ్విసెర్ (ఆర్ &డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు అధ్యాపక సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :