Monday, 27 July 2026 04:19:39 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విప్ ప‌ద‌వికి జ‌న‌సేన ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్ రాజీనామా

Date : 23 May 2026 03:52 PM Views : 72

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి -మే 23 : రాజీనామా ప‌త్రాన్ని పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌మ‌ర్పించిన అర‌వ శ్రీ‌ధ‌ర్‌ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న‌ తిరుపతి జిల్లా జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి అందజేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఈ రోజు (శనివారం) రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన పలు ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు. అనంతరం వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పవన్‌కు తెలిపారు. కొన్ని రోజులుగా హర్ష వీణ, ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ మోసం చేశారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పలు సంచలన వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసు నమోదు కాగా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అరవ శ్రీధర్‌పై తాజాగా మరికొన్ని రాజకీయపరమైన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ పదవికి ఎమ్మెల్యే శ్రీధర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :