Sunday, 26 July 2026 09:20:52 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ లో విద్యార్థులకు కెరియర్ అపర్చునిటీస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ పై అవగాహన

Date : 23 January 2026 04:59 PM Views : 177

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 22 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ ఆధ్వర్యంలో కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన అంబటి చక్రధర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, ఔరిసియా కన్సల్టెన్సీ, హైదరాబాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య చేయడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, యూఎస్‌ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, తైవాన్, జపాన్ వంటి దేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్‌కు సంబంధించిన మాస్టర్స్ (ఎంఎస్) మరియు పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల విద్యార్హతలు, ఆసక్తి మరియు కెరీర్ లక్ష్యాలను బట్టి సరైన యూనివర్సిటీ మరియు కోర్సు ఎంపికలో సహకరిస్తామని, అలాగే వీసా డాక్యుమెంటేషన్, ఇంటర్వ్యూ సన్నాహాలు తన కన్సల్టెన్సీ ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యలో అధునాతన తయారీ సాంకేతికతలు, రోబోటిక్స్, ఆటోమొబైల్, ఏరోస్పేస్ వంటి ప్రత్యేక విభాగాల్లో నైపుణ్యం పొందడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు స్కాలర్‌షిప్‌లు, స్టైపెండ్లు ద్వారా అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు.. ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన సదుపాయాలు మరియు పరిశ్రమలతో అనుసంధానం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి జ్ఞానం లభిస్తుందని అన్నారు. విదేశాల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య అభ్యసించడం వల్ల ప్రపంచ స్థాయి కెరీర్ అవకాశాలు, పరిశోధన మరియు ఇన్నోవేషన్‌లో పాల్గొనే అవకాశం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి విద్యార్థులు సరైన ప్రణాళికతో ముందుకు సాగడం అవసరం అని అన్నారు. కార్యక్రమంలో అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగశ్వేతా, ఆర్&డి అసోసియేట్ డీన్ డాక్టర్ పి.శివయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: