Sunday, 26 July 2026 12:23:41 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తంబళ్లపల్లె ఐటిఐ జాబ్ మేళా 100% ఉద్యోగ అవకాశాలు - ప్రిన్సిపల్ నాగరాజు

Date : 01 June 2026 10:18 PM Views : 53

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 01 : తంబళ్లపల్లె లోని శ్రీ టి ఎన్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ ఐటిఐలో సోమవారం జరిగిన జాబ్ మేళాలో ఎన్నడూ లేని విధంగా వందశాతం నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందడం హర్షనీయమని ప్రిన్సిపాల్ నాగరాజు కొనియాడారు. ఉదయం ప్రిన్సిపాల్ నాగరాజు ఆధ్వర్యంలో శ్రీజ తిరుపతి పాలడైరీ, అమర్ రాజా, వీ టి ఎస్ బెంగళూరు, యుఎన్ఓ మైన్ బెంగళూరు, ఎల్ అండ్ టి కాంచీపురం, సాయి ఎంటర్ప్రైజెస్ బెంగళూరు కంపెనీలకు చెందిన ప్రతినిధులు 58 మంది నిరుద్యోగులను వారి ప్రతిభను పరీక్షించి 58 మంది ని 100% ఎంపిక చేసుకొని నియామక పత్రాలను ప్రిన్సిపాల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించిన కంపెనీ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉద్యోగ అవకాశాలు పొందిన నిరుద్యోగులు అంకితభావంతో ఉద్యోగాలలో చేరి ఆర్థిక అభివృద్ధి సాధన తో పాటు తంబళ్లపల్లె ఐటిఐ కి మంచి పేరు తేవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థులు మాట్లాడుతూ తంబళ్లపల్లె ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం నిస్వార్థంగా ఐటిఐ స్థాపించిన టి.ఎన్ కుటుంబ సభ్యులకు జీవితాంతం రుణపడి ఉంటామని అదేవిధంగా ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం, ఉద్యోగ అవకాశాలు కల్పించిన కంపెనీ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో శ్రీజ పాల డైరీ ఏరియా మేనేజర్ కృష్ణప్ప తోపాటు ప్రతినిధులు, ఐటిఐ అధ్యాపకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :