నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం వద్ద బొలెరో బోల్తా పడిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, బిసి జనార్దన్ ఋడ్డి లకు ఫోన్ లో సమాచారం అందించి నారా లోకేష్ సీఎంఓ కార్యాలయానికి సమాచారం అందించారు. ఈ సందర్భంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రమాద విషయం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన మందులు, చికిత్స, సదుపాయాల్లో ఎలాంటి లోటు లేకుండా చూడాలని కోరుతూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Reporter
Namitha News